Skip to main content

Namaste NRI

మా ఊరి పొలిమేర  సీక్వెల్ షూటింగ్ పూర్తి

సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, బాలాదిత్య, రవి వర్మ, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్  ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మా ఊరి పొలిమేర సినిమా సీక్వెల్ చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రానికి డా॥ అనిల్ విశ్వనాథ్ దర్శకుడు. గౌరికృష్ణ నిర్మాత. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉత్తరాఖండ్, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఖమ్మం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే  షూటింగ్  పూర్తి చేసుకుంది. అందరిని ఆకట్టుకునే వినూత్నమైన కథ ఇదని చిత్రబృందం పేర్కొంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన  పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

Social Share Spread Message

Latest News