Namaste NRI

నేపాల్ వైస్ ప్రెసిడెంట్‌గా రామ్ స‌హ‌య్ ప్ర‌సాద్ యాద‌వ్

నేపాల్ ఉపాధ్యక్షుడిగా  రామ్ స‌హాయ్ ప్ర‌సాద్ యాద‌వ్  ఎన్నిక‌య్యారు. జ‌న‌తా స‌మాజ్‌బాదీ పార్టీ  కి చెందిన రామ్ స‌హ‌య్ సీపీఎన్ – యూఎంఎల్  పార్టీ అభ్య‌ర్థి అష్ట‌ ల‌క్ష్మి శ‌క్యాపై భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆయ‌న ఐదేళ్ల పాటు ఈ ప‌ద‌విలో కొన‌సాగ‌నున్నారు.  మొత్తం పోలైన 52,628 ఓట్ల‌లో రామ్ స‌హాయ్‌కు 30,328 ఓట్లు వ‌చ్చాయి. ల‌క్ష్మిశ‌క్యాకు 16,328 ఓట్లు ప‌డ్డాయి. జ‌న‌మ‌త్ పార్టీకి చెందిన మ‌మ‌తా ఝా 2,537 ఓట్ల‌తో మూడో స్థానంలో నిలిచారు. ఉపాధ్య‌క్షుడి ఎన్నిక నుంచి త‌ప్పుకున్న ప్ర‌మీలా యాద‌వ్‌(జ‌న‌తా స‌మాజ్‌వాదీ పార్టీ)కు 48 ఓట్లు వ‌చ్చాయి. యాదవ్‌కు ఆయన సొంతపార్టీ సభ్యులతోపాటు నేపాలీ కాంగ్రెస్, సిపిఎన్ మావోయిస్టు సెంటర్, సిపిఎన్ యూనిఫైడ్ సోషలిస్టు పార్టీలు ఓటువేసినట్లు పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News