Skip to main content

Namaste NRI

అమెరికాలో మరోసారి టోర్నడో బీభత్సం

అమెరికాలో టోర్నడో మరోసారి బీభత్సం సృష్టించింది. సెయింట్‌ లూయిస్‌ దక్షిణ ప్రాంతానికి 50 మైళ్ల దూరంలోని బొలింగర్‌ కౌంటీ మీదుగా బుధవారం ఉదయం 3.30-4.00 గంటల మధ్య తుఫాన్‌ పయనించినట్టు వారు చెప్పారు. అయితే ఎంతమంది మరణించారో, ఎంతమంది గాయపడ్డారో ఇప్పుడే చెప్పలేమన్నారు. తుఫాన్‌ అనంతర దృశ్యాలు మనసును కలచివేస్తున్నాయని పేర్కొన్నారు. నాలుగు రోజుల క్రితమే దక్షిణ, మధ్య ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చిన టోర్నడో తాజాగా మిస్సోరి ఆగ్నేయ ప్రాంతంలో విధ్వంసం సృష్టించింది. ఈ తుఫాన్‌ ధాటికి పలువురు మృతి చెందగా, చాలా మంది గాయపడినట్టు అధికారులు తెలిపారు.

Social Share Spread Message

Latest News