Namaste NRI

లండన్‌లో ఘనంగా తెలుగు సినీ సంగీత విభావరి   

 లండన్‌ లోని ఈస్ట్ హ్యాంరాయల్ రీజేన్స్ హాల్లో నిర్వహించిన తెలుగు  సినీ సంగీత విభావరి  తెలుగు ప్రేక్షకులను అలరించాయి. డీవీకే గేట్‌వేస్‌ సంస్థ  ఆధ్వర్యంలో ప్రముఖ గాయనీ గాయకులు  మనో, కార్తీక్, కల్పన , గోపిక పూర్ణిమ, అనురాధ శ్రీరాం తదితరులు పాడిన పాటలకు ప్రేక్షకులు ముగ్ధులయ్యారని నిర్వాహకురాలు లావణ్య కావూరి తెలిపారు.

ఈ సందర్భంగా గాయనీ, గాయకులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. లండన్ లో పుట్టి పెరిగిన అమ్మాయి చిన్మయీ తడకమల్ల తన మాటలతో ప్రేక్షకులందరినీ ఆలరించింది. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం కావడానికి సహకరించిన వినోద్ దొప్పలపూడి, సురేంద్ర శ్రీనివాస్ రెడ్డి పింగళి, సురేందర్ రెడ్డి, శ్రవణ్ కుమార్ గౌడ్ బైరు, వంశీ , హరీష్, భరత్ లను డీవీకే గేట్‌వేస్‌ సంస్థ యాజమానురాలు లావణ్య కావురి , వినోద్ సన్మానించారు.  ఈ సంగీత విభావరి కార్యక్రమానికి పన్నెండు వందలమందికి పైగా ప్రవాస తెలుగు ప్రజలు హాజరయ్యారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events