Skip to main content

Namaste NRI

వైభవంగా జయహో రామానుజ ట్రైలర్ లాంచ్

స్వీయ దర్శకత్వంలో డా॥ సాయివెంకట్‌ నటిస్తున్న ఆధ్యాత్మిక చిత్రం జయహో రామానుజ. సుదర్శనం ప్రొడక్షన్స్‌ పతాకంపై సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. జోశర్మ, సుమన్‌, ప్రవళ్లిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకురానుంది. గురువారం ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఆధ్యాత్మిక విప్లవకారుడు, సమసమాజమే ధ్యేయంగా పనిచేసిన రామానుజాచార్యుల జీవితం గురించి నేటితరానికి తెలియజెప్పాలనే సంకల్పంతో ఈ చిత్రాన్ని రూపొందించామని సాయివెంకట్‌ తెలిపారు. ఈ సినిమాలో తనకు మంచి పాత్ర దక్కిందని, ఈ సినిమా ద్వారా ప్రతీ ఒక్కరూ రామానుజాచార్యుల గొప్పదనాన్ని తెలుసుకుంటారని సుమన్‌ పేర్కొన్నారు. సుమన్‌, ప్రవళ్లిక అశ్వాపురం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ: సుదర్శనం ప్రొడక్షన్స్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: లయన్‌ సాయి వెంకట్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events