Skip to main content

Namaste NRI

అమెరికా వెళ్లేవారికి షాక్‌…మే 30 నుంచి అమల్లోకి

విదేశీ విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారులు, వృత్తిదారుల వీసా దరఖాస్తు ఫీజులను 15 నుంచి 110 డాలర్ల మేరకు పెంచుతున్నట్టు అమెరికా ప్రకటించింది. స్టూడెంట్‌, విజిటర్‌ వీసాలతోపాటు ఇతర నాన్‌-పిటిషన్‌ బేస్డ్‌ నాన్‌-ఇమ్మిగ్రెంట్‌ వీసా ఫీజులను ప్రస్తుతమున్న 160 డాలర్ల నుంచి 185 డాలర్లకు పెంచుతున్నట్టు ఆ దేశ విదేశాంగ శాఖ వెల్లడించింది.  వీటితోపాటు తాత్కాలిక వృత్తిదారులకు ఇచ్చే కొన్ని రకాల నాన్‌-ఇమ్మిగ్రెంట్‌ వీసా ఫీజును 190 నుంచి 205 డాలర్లకు, ప్రత్యేక వృత్తి నిపుణులకు ఇచ్చే వీసా ఫీజును 205 డాలర్ల నుంచి 315 డాలర్లకు పెంచుతున్నట్టు పేర్కొన్నది. కొత్త వీసా ఫీజులు ఈ ఏడాది మే 30 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. దీంతో అమెరికా యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందిన భారతీయ విద్యార్థులు వీసా కోసం రూ.14 వేలకుపైగా చెల్లించాల్సి ఉంటుంది.

Social Share Spread Message

Latest News