Namaste NRI

దుబాయ్ ఇండోర్ క్రికెట్ సిరీస్‌కు ఎంపికైన… మైగ్రెంట్ ఫోర్స్ క్రికెట్ లీగ్ ఆటగాళ్లు

సంక్రాంతి పండగ సందర్భంగా జనవరిలో శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన మైగ్రెంట్ ఫోర్స్ క్రికెట్  టోర్నీలో ఉత్త‌మ క్రికెట‌ర్లు ముగ్గురు తెలుగు కార్మిక సోద‌రులు ఎంపిక‌య్యారు. వారిని ఈ నెల 24-29 మ‌ధ్య దుబాయిలో జ‌రిగే క్ల‌బ్ వ‌ర‌ల్డ్ సిరీస్‌-ఇండోర్ క్రికెట్ టోర్న‌మెంట్‌కు సింగ‌పూర్ ఇండోర్ క్రికెట్ అసోయేష‌న్  త‌ర‌ఫున పంపుతున్నారు.అలా ఎంపికైన వారిలో పిన‌కాన తులసీరామ్‌, సీడీ దిలీప్ వ‌ర‌ప్ర‌సాద్‌, అక్క‌ర‌మ‌ణి గ‌ణేశ్ కుమార్ ఉన్నారు. టీం కెప్టెన్‌గా రామ్ మడిపల్లి వ్యవహరించనున్నార‌ని సింగపూర్ ఇండోర్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు మురళీధరన్ గోవిందరాజన్, శంకర్ వీర తెలిపారు. మైగ్రెంట్ ఫోర్స్ క్రికెట్ లీగ్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ముగ్గురు ఆటగాళ్ళు దుబాయి ఇండోర్ క్రికెట్ సిరీస్‌కి ఎంపిక అవ్వడం పట్ల టోర్నమెంట్ నిర్వాహుకులు గిరిధర్ సారాయి, నగేష్ టేకూరి, పోతగౌని నర్సింహా గౌడ్, అశోక్ ముండ్రు, కంకిపాటి శశిధర్ , సుదర్శన్ పూల, రాము చామిరాజు, సుధాకర్ జొన్నాదుల, పాతూరి రాంబాబు, శ్రీధర్ భరద్వాజ్, సునీల్ రామినేని, కరుణాకర్ కంచేటి , మిట్టా ద్వారకానాథ్, తోట సహదేవుడు, ఎస్ కుమార్, లీల మోహన్, సురేంద్ర చేబ్రోలు తదితరులు హర్షం వ్య‌క్తం చేశారు. దుబాయి క్ల‌బ్ వ‌ర‌ల్డ్ సిరీస్ టోర్నీకి ఎంపికైన క్రికెట‌ర్ల‌ను శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ అభినందించారు. వారు ఈ టోర్నీలో కూడా జ‌య కేత‌నం ఎగుర‌వేయాల‌ని ఆకాంక్షించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events