Namaste NRI

అన్నీ మంచి శకునములే నుంచి గల గల ఏరులా

సంతోష్‌ శోభన్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం అన్నీ మంచి శకునములే. బి.వి.నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. స్వప్న సినిమాస్‌, మిత్ర విందా మూవీస్‌ పతాకంపై ప్రియాంక దత్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మాళవిక నాయర్‌, రాజేంద్రప్రసాద్‌, రావు రమేష్‌, నరేష్‌ తదితరులు నటిస్తున్నారు.  ఈ సినిమాలోని గల గల ఏరులా అంటూ సాగే మూడో గీతాన్ని విడుదల చేశారు. మిక్కీ జే మేయర్‌ స్వరపరచిన ఈ గీతాన్ని రెహమాన్‌ రచించారు. నకుల్‌ అభ్యంకర్‌, రమ్యభట్‌ ఆలపించారు. ఇటలీలోని అందమైన లొకేషన్లలో ఈ పాటను చిత్రీకరించామని, ప్రేమికుల మదిలోని భావాలకు అద్దం పడుతుందని చిత్రబృందం పేర్కొంది. ఈ  చిత్రం  మే 18న విడుదలకానుంది. ఈ చిత్రానికి కెమెరా: సన్నీ కూరపాటి, సంభాషణలు: లక్ష్మీ భూపాల, దర్శకత్వం: బీవీ నందినిరెడ్డి.

Social Share Spread Message

Latest News