అమెరికాలో వివిధ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపడుతున్న ప్రవాస తెలంగాణ వాసి కృష్ణ ప్రసాద్ సోంపల్లికి బోస్టన్ కేర్స్ అవార్డు దక్కింది. 2023 సంవత్సరానికి కృష్ణప్రసాద్ సోంపల్లి ఈ అవార్డుకు ఎంపికయ్యారు. నగరంలో చేపట్టిన అనేక సేవా కార్యక్రమాలకు గాను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు అవార్డు కమిటీ ప్రకటించింది. కృష్ణ ప్రసాద్ ఈ అవార్డు సాధించడంపై బోస్టన్‌లోని ప్రవాస తెలంగాణ వాసులు హర్షం వ్యక్తం చేశారు. బోస్టన్‌లో చేపట్టిన సేవా కార్యక్రమాలకు బోస్టన్ కేర్స్ పేరిట అక్కడి పౌరులకు ప్రతి ఏటా అవార్డు అందజేస్తారు.


