Skip to main content

Namaste NRI

ప్రవాస తెలంగాణవాసి కృష్ణప్రసాద్ కు బోస్టన్ కేర్స్ అవార్డు

అమెరికాలో వివిధ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపడుతున్న ప్రవాస తెలంగాణ వాసి కృష్ణ ప్రసాద్ సోంపల్లికి బోస్టన్ కేర్స్ అవార్డు దక్కింది. 2023 సంవత్సరానికి కృష్ణప్రసాద్ సోంపల్లి ఈ అవార్డుకు ఎంపికయ్యారు. నగరంలో చేపట్టిన అనేక సేవా కార్యక్రమాలకు గాను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు అవార్డు కమిటీ ప్రకటించింది. కృష్ణ ప్రసాద్ ఈ అవార్డు సాధించడంపై బోస్టన్‌లోని ప్రవాస తెలంగాణ వాసులు హర్షం వ్యక్తం చేశారు. బోస్టన్‌లో చేపట్టిన సేవా కార్యక్రమాలకు బోస్టన్ కేర్స్ పేరిట అక్కడి పౌరులకు ప్రతి ఏటా అవార్డు అందజేస్తారు.

Social Share Spread Message

Latest News