కె.విజయ్‌భాస్కర్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం జిలేబి. ఎస్ఆర్కే ఆర్ట్స్ పతాకంపై గుంటూరు రామకృష్ణ నిర్మిస్తున్నారు. విజయ్‌భాస్కర్ తనయుడు శ్రీకమల్ హీరోగా పరిచయమవుతున్నాడు. శివాని రాజశేఖర్ కథానాయిక గా నటిస్తోంది. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.మా హాస్టల్లో ఉన్నది స్టూడెంట్స్ కాదు, వజ్రాలు..24 గంటలు చదువుతూనే ఉంటారు అంటూ రాజేంద్రప్రసాద్ చెప్పే డైలాగ్ వినోదాన్ని పండించింది. టీజర్ ఆద్యంతం హాస్యప్రధానంగా సాగింది. టీజర్ లో శ్రీకమల్, శివాని రాజశేఖర్ ప్రెజెన్స్ ఆకట్టుకుంది. ఈ సినిమాలో కామెడీతో పాటు హారర్ ఎలిమెంట్ ఉంటుంది. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా మెప్పిస్తుంది అని చిత్రబృందం పేర్కొంది. మొత్తానికి ఈ టీజర్ జిలేబి హిలేరియస్ ఫన్ ఫుల్ రైడ్ అనే భరోసా ఇచ్చింది. ఇప్పటికే విడుదలైన జిలేబి ఫస్ట్ లుక్ గ్లింప్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, దర్శకత్వం: కె.విజయ్‌భాస్కర్. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫర్ గా, ఎం.ఆర్. వర్మ ఎడిటర్ గా పని చేస్తున్నారు.


