Skip to main content

Namaste NRI

కె. విజ‌య‌భాస్కర్ దర్శకత్వంలో జిలేబి టీజర్ విడుదల

కె.విజయ్‌భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం జిలేబి. ఎస్‌ఆర్‌కే ఆర్ట్స్‌ పతాకంపై గుంటూరు రామకృష్ణ నిర్మిస్తున్నారు. విజయ్‌భాస్కర్‌ తనయుడు శ్రీకమల్‌ హీరోగా పరిచయమవుతున్నాడు. శివాని రాజశేఖర్‌ కథానాయిక గా నటిస్తోంది.  ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.మా హాస్టల్‌లో ఉన్నది స్టూడెంట్స్‌ కాదు, వజ్రాలు..24 గంటలు చదువుతూనే ఉంటారు అంటూ రాజేంద్రప్రసాద్‌ చెప్పే డైలాగ్‌ వినోదాన్ని పండించింది. టీజర్‌ ఆద్యంతం హాస్యప్రధానంగా సాగింది. టీజర్ లో శ్రీకమల్, శివాని రాజశేఖర్ ప్రెజెన్స్ ఆకట్టుకుంది.  ఈ సినిమాలో కామెడీతో పాటు హారర్‌ ఎలిమెంట్‌ ఉంటుంది. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా మెప్పిస్తుంది అని చిత్రబృందం పేర్కొంది. మొత్తానికి ఈ టీజర్ జిలేబి హిలేరియస్ ఫన్ ఫుల్ రైడ్ అనే భరోసా ఇచ్చింది. ఇప్పటికే విడుదలైన జిలేబి ఫస్ట్ లుక్ గ్లింప్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, దర్శకత్వం: కె.విజయ్‌భాస్కర్‌. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫర్ గా, ఎం.ఆర్. వర్మ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events