సింగపూర్‌లో ఆంధ్రుల ఆరాధ్య నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు సింగపూర్ తెలుగుదేశం ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఆహ్వానితులు ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, 20 సూత్రాల అమలు కమిటీ మాజీ చైర్మన్ శేష సాయి బాబా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ తీసుకొచ్చిన సంస్కరణలను వివరించారు.


