నటుడు నాగబాబు కుమార్తె నటి, నిర్మాత నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డతో తన వివాహా బంధానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఫ్యామిలీ కోర్టు ద్వారా విడాకులు పొందిన ఈ జంట గత కొంతకాలంగా విడి విడిగా వుంటున్నారు. అయితే విడాకులపై తొలిసారిగా నిహారిక కొణిదెల స్పందించారు. నేను చైతన్య పరస్పర అంగీకారంతోనే వివాహ బంధానికి వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నాం. ఈ పరిస్థితుల్లో నా వెన్నంటి ఉండి, నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చిన నా కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, స్నేహితులకు ధన్యవాదాలు. ఈ పరిణామాల తరువాత మా జీవితాల్లో మేం ముందుకు వెళ్లడానికి మాకు కొంత ప్రైవసీ ఇవ్వాలని అందరినీ కోరుకుంటున్నాం. నన్ను అర్థం చేసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు అని తెలిపారు నిహారిక.


