పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ప్రాజెక్ట్ కె. ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకొనే, దిశా పటానీ నటిస్తున్నారు. వైజయంతీ బ్యానర్‌పై అశ్వినీదత్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. కాగా తాజాగా ఈ సినిమా నుంచి దీపికా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. నాచురల్ లుక్ లో ఉన్న దీపికా పోస్టర్ అదిరిపోయింది. గ్లింప్స్ రిలీజయ్యే వరకు ప్రతీ రోజు ఈ సినిమాలో మేయిన్ కాస్ట్ పోస్టర్లను రివీల్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, కమల్ హాసన్, దిశా పటాని స్టార్ కాస్ట్ నటిస్తుంది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. బిగ్‌బీ అమితాబ్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో కమల్ హాసన్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. సంక్రాంతికి టార్గెట్ ఫిక్స్ చేసుకున్నా, షూటింగ్ ఇంకా చాలా పెండింగ్ ఉండటంతో అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.
