బ్రిటన్‌లో రిషి సునాక్ నాయకత్వంలోని అధికార కన్జర్వేటివ్ పార్టీకి గట్టి ఎదురుబెబ్బ తగిలింది. మొత్తం మూడు పార్లమెంట్ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో రెండు చోట్ల పార్టీ ఓటమి పాలైంది. ఉత్తర ఇంగ్లాండ్‌లోని సెల్బే`అయిన్‌స్టీ సీటులో లేబర్ పార్టీ గెలుపొందింది. గతంలో ఇక్కడ కన్జర్వేటివ్ పార్టీ భారీ మెజార్టీని పొందింది. ఇక మరో స్థానమైన సోమర్టన్`ఫ్రోమ్‌ను లిబరల్ డెమోక్రటిక్ పార్టీ గెలుచుకొంది. ఇక కన్జర్వేటివ్ పార్టీ ఉక్స్‌బ్రిడ్జ్`సౌత్ రూయిస్లిప్ సీటును మాత్రం దక్కించుకొంది. గతంలో ఇది బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ గెలిచిన స్థానం. ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఉప ఎన్నికల నిర్వహించారు. ఇక్కడ పార్టీ గతంలో కంటే బలపడిరది. ఈ ఫలితాలు సునాక్ నాయకత్వంపై ఒత్తిడిని గణనీయంగా పెంచుతాయని విశ్లేషకులు చెబుతున్నారు.
