అమెరికాలో భారత విద్యార్థినిపై పిడుగుపడటంతో ఆమె మృత్యువుతో పోరాడుతుంది. సుశ్రూణ్య కోడూరు (25) అనే విద్యార్థిని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ (యూహెచ్)లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాస్టర్స్ చదువుతుంది. జులై మొదటివారంలో సుశ్రూణ్య తన స్నేహితులతో కలిసి స్థానిక పార్కులోని ఓ కొలను వెంబడి నడుచుకుంటూ వెళుతున్న సమయంలో పిడుగుపాటుకు గురైంది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. సుశ్రూణ్య బంధువు కొత్త.సురేంద్రకుమార్ మాట్లాడుతూ సుశ్రూణ్య పిడుగుపాటుకు గురైన వెంటనే కొలనులో పడిపోయారని, ఆ సమయంలో 20 నిమిషాలపాటు గుండె లయ తప్పడంతో మెదడు దెబ్బతిందని, తర్వాత ఆమె కోమాలోకి వెళ్లిపోయారని తెలిపారు. ఆమె మెదడు దెబ్బతిందని, సుదీర్ఘకాలం చాలా కీలకమైన వైద్య చికిత్స అందించాల్సి ఉంటుందని ఆసుపత్రి వర్గం తెలిపిందన్నారు. ఈ నేపథ్యంలో ఆమె వైద్య ఖర్చుల కోసం, కుటుంబసభ్యులను పిలిచేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని కోరుతూ ఆన్‌లైన్‌లో గోఫండ్‌మీ ని ఏర్పాటు చేశారని వివరించారు.
