Skip to main content

Namaste NRI

అగ్రరాజ్యంలో విషాదం..మృత్వువుతో పోరాడుతున్న భారతీయ విద్యార్థిని

అమెరికాలో భారత విద్యార్థినిపై పిడుగుపడటంతో ఆమె మృత్యువుతో పోరాడుతుంది. సుశ్రూణ్య కోడూరు (25) అనే విద్యార్థిని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ హ్యూస్టన్‌ (యూహెచ్‌)లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మాస్టర్స్‌ చదువుతుంది. జులై మొదటివారంలో సుశ్రూణ్య తన స్నేహితులతో కలిసి స్థానిక పార్కులోని ఓ కొలను వెంబడి నడుచుకుంటూ వెళుతున్న సమయంలో పిడుగుపాటుకు గురైంది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. సుశ్రూణ్య బంధువు కొత్త.సురేంద్రకుమార్‌ మాట్లాడుతూ సుశ్రూణ్య పిడుగుపాటుకు గురైన వెంటనే కొలనులో పడిపోయారని, ఆ సమయంలో 20 నిమిషాలపాటు గుండె లయ తప్పడంతో మెదడు దెబ్బతిందని, తర్వాత ఆమె కోమాలోకి వెళ్లిపోయారని తెలిపారు. ఆమె మెదడు దెబ్బతిందని, సుదీర్ఘకాలం చాలా కీలకమైన వైద్య చికిత్స అందించాల్సి ఉంటుందని ఆసుపత్రి వర్గం తెలిపిందన్నారు. ఈ నేపథ్యంలో  ఆమె వైద్య ఖర్చుల కోసం, కుటుంబసభ్యులను పిలిచేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని కోరుతూ ఆన్‌లైన్‌లో గోఫండ్‌మీ ని ఏర్పాటు చేశారని వివరించారు.

Social Share Spread Message

Latest News