Skip to main content

Namaste NRI

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరిలో మరో భారతీయ అమెరికన్ 

వచ్చే ఏడాది జరుగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరో భారతీయ అమెరికన్‌ బరిలో నిలిచారు. తాజాగా తాను కూడా పోటీకి దిగుతున్నట్టు ఏరోస్పేస్‌ ఇంజినీర్‌ హర్షవర్ధన్‌ సింగ్‌  ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. రిపబ్లికన్‌ పార్టీ నుంచి ఆయన అభ్యర్థిత్వం ఆశిస్తున్నారు. 2020లో ఆయన సెనేట్‌కు పోటీచేసి ఓటమిపాలయ్యారు. సహచర రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ను గ్రేటెస్ట్‌ ప్రెసిడెంట్‌  అంటూ కొనియాడిన హర్షవర్ధన్‌.. దేశానికి మరింత సేవ చేసేవారి అవసరముందని పేర్కొన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్నట్టు భారత సంతతికి చెందిన సౌత్‌ కరోలినా గవర్నర్‌ నిక్కీ హేలీ, పారిశ్రామిక వేత్త వివేక్‌ రంగస్వామి ఇప్పటికే ప్రకటించారు.  రిపబ్లికన్‌ పార్టీ నుంచి చాలా మంది అభ్యర్థిత్వం ఆశిస్తున్నారు.

Social Share Spread Message

Latest News