Skip to main content

Namaste NRI

నెల రోజులపాటు శ్రీవారి పుష్కరిని బంద్‌.. ఎందుకో తెలుసా?

తిరుమల భక్తులకు అలర్ట్. తిరుమ‌లలో శ్రీ‌వారి ఆల‌యం వద్ద గల పుష్కరిణిని నేటి నుంచి నెలరోజుల పాటు మూసివేయనున్నారు. పుష్కరిణిలో ఉన్న నీటిని తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టనున్నామని, ఇందులో భాగంగా ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు పుష్కరిణిని మూసివేస్తున్నామని టీటీడీ తెలిపింది. ఈ నెల రోజులపాటు పుష్కరిణికి హార‌తి ఉండ‌దని అధికారులు చెప్పారు. సాధారణంగా స్వామి పుష్కరిణిలో నీరు నిల్వ ఉండే అవ‌కాశం లేదని, పుష్కరిణిలోని నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు అత్యుత్తమ రీసైక్లింగ్ వ్యవ‌స్థ అందుబాటులో ఉందన్నారు. నిరంత‌రాయంగా కొంత శాతం చొప్పున నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగిస్తామని తెలిపారు.  శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా నెల రోజుల పాటు పుష్కరిణిలో నీటిని తొల‌గించి చిన్న చిన్న మ‌ర‌మ్మతుల‌ను పూర్తి చేస్తామని వెల్లడించారు. మరమ్మతులు పూర్తి చేసి చివ‌రి ప‌ది రోజులు పుష్కరిణిలో నీటిని నింపి పూర్తిగా సిద్ధం చేయనున్నామని పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events