Skip to main content

Namaste NRI

క‌విత చేతుల మీదుగా సౌండ్ పార్టీ చిత్రం పోస్ట‌ర్ లాంచ్‌

వీజే సన్నీ, హ్రితిక జంటగా సంజయ్‌ శేరి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం  సౌండ్‌ పార్టీ.  ఫుల్‌మూన్‌ మీడియా ప్రొడక్షన్స్‌ పతాకంపై రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీశ్యామ్‌ గజేంద్ర నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో   శివన్నారాయణ, అలీ, సప్తగిరి, పృథ్వీ, మాణిక్‌ రెడ్డి, కాదంబరి కిరణ్‌ తదితరులు నటిస్తున్నారు.  ఈ చిత్ర పోస్టర్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సినిమా టైటిల్‌ చాలా ఆసక్తికరంగా ఉంది. కాన్సెప్ట్‌ కూడా చాలా కొత్తగా ఉండబోతుందని టైటిల్‌ను చూస్తే అర్థమవుతున్నది. ఈ సినిమా పెద్ద విజయం సాధించి అందరికి మంచి గుర్తింపును తీసుకురావాలని కోరుకుంటున్నాఅన్నారు.  

దర్శకుడు మాట్లాడుతూ టైటిల్‌కు అద్భుతమైన స్పందన లభిస్తున్నది. ఎమ్మెల్సీ కవితగారు పోస్టర్‌ను ఆవిష్కరించి మమ్మల్ని ఆశీర్వదించడం ఆనందంగా ఉంది. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా అందరిని అలరిస్తుంది అని చెప్పారు. ఫుల్‌ మీడియా ప్రొడక్షన్స్‌ సంస్థ రూపొందిస్తున్న తొలి చిత్రమిదని, వినూత్నమైన కథాంశంతో ఆకట్టుకుంటుందని నిర్మాత రవి పోలిశెట్టి తెలిపారు. యువతరంతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ నచ్చే అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయని హీరో వీజే సన్నీ పేర్కొన్నారు.  చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి కెమెరా: శ్రీనివాస్‌ రెడ్డి, సంగీతం: మోహిత్‌ రెహమానిక్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రాజీవ్‌ నాయర్‌, సమర్పణ: జయశంకర్‌, రచన-దర్శకత్వం: సంజయ్‌ శేరి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events