Namaste NRI

ఘనంగా దసరా వంద రోజుల వేడుక

నేచురల్ స్టార్ నాని మాసియస్ట్ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్ దసరా. హీరోయిన్ కీర్తి సురేష్. ఈ ఏడాది మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంచలన విజయం సాధించి సక్సెస్‌ఫుల్‌గా 100 రోజులని పూర్తి చేసుకుంది.  ఈ సందర్భంగా మూవీ టీమ్ సెలబ్రెషన్స్ చేసుకుంది.  ఈ సందర్భం మేకర్స్ చిత్ర యూనిట్, డిస్ట్రిబ్యూటర్లకు షీల్డ్ అందించారు. హీరో నేచురల్ స్టార్ నాని పాల్గొన్న ఈ గ్రాండ్ ఈవెంట్ లో నిర్మాతలు అనిల్ సుంకర, నాగ వంశీ, సాహుగారపాటి, గోపి ఆచంట హాజరయ్యారు. శ్రీ లక్ష్మీ వెంకశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళంతో పాటు కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన దసరా సినిమా, అన్ని లాంగ్వేజెస్ లోనూ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమా అనుకున్న అంచనాలు రీచ్ అయ్యి భారీ హిట్ అండ్ సెన్సేషనల్ ఓపెనింగ్స్ నమోదు చేసింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events