Skip to main content

Namaste NRI

అదృష్టం అంటే ఇదే మరీ…అమెరికా చరిత్రలోనే

అమెరికాలో ఫ్లోరిడా మెగా మిలియన్స్‌ లాటరీలో ఓ వ్యక్తి 1.58 బిలియన్‌ డాలర్ల ( సుమారు రూ.13 వేల కోట్లు) జాక్‌పాట్‌ కొట్టారు. నెవ్యూన్‌ బీచ్‌లోని పబ్లిక్స్‌ స్టోర్‌ విక్రేత ఈ టికెట్‌ను విక్రయించారు. లాటరీ నిర్వహకులు డ్రా తీశారు. అందులో 13, 19, 20, 32, 33, 14 నంబరు టికెట్‌కు జాక్‌పాట్‌ దక్కినట్లు ప్రకటించారు. అమెరికా చరిత్రలో మూడో అతి పెద్ద లాటరీ ప్రైజ్‌మనీ ఇదేనని తెలిసింది. డ్రాలో గెలుపొందిన వ్యక్తికి రూ.1.58 బిలియన్‌ డాలర్ల నగదును ఏడాదికి కొంత మొత్తం చొప్పున 30 ఏళ్ల పాటు చెల్లిస్తారు. అలా కాకుండా ఒకేసారి ఈ మొత్తాన్ని పొందాలంటే అతనికి సుమారు 783.3 మిలియన్‌ డాలర్లు (రూ.6,488 కోట్లు ) మాత్రమే వస్తాయి.

Social Share Spread Message

Latest News