దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కింగ్ ఆఫ్ కోత. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అభిలాష్ జోషి దర్శకుడు. ఈ చిత్రం లో ఐశ్వర్యలక్ష్మి, షబీర్ కల్లరక్కల్, ప్రసన్న, నైలా ఉష, గోకుల్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను అగ్ర నటులు మోహన్‌లాల్, నాగార్జున, షారుఖ్‌ఖాన్ విడుదల చేశారు. కేరళలోని కోత అనే పట్టణం నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కోత పట్ణణం తాలూకు వ్యక్తులు, అక్కడి పరిస్థితులను చూపిస్తూ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. అధికారం, ఆధిపత్యం కోసం వేసే ఎత్తుకుపై ఎత్తులు ఉత్కంఠను పంచాయి. యాక్షన్ ఎపిసోడ్స్, విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమా ఒక అసాధారణమైన ప్రయాణమని, నటుడిగా కొత్త అనుభవాన్నిచ్చిందని హీరో దుల్కర్ సల్మాన్ పేర్కొన్నారు. అత్యున్నత నిర్మాణ విలువలతో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకురానుంది.














