పసిఫిక్ సముద్రంలోని హవాయి ద్వీపంలో కార్చిచ్చు తీవ్ర కలకలం రేపుతోంది. మాయి కౌంటీలో పర్యాటకానికి పేరుగాంచిన లహైనా అగ్నికీలల్లో చిక్కుంది. అమెరికాలో చివర గా ఏర్పడిన రాష్ట్రం హవాయి. ఈ ద్వీపాల పశ్చిమ దిక్కున ఉండే లహైనా విలాసవంతమైన హోటళ్లతో పర్యాటకానికి పేరుగాంచింది. మాయి విమానాశ్రయం నుంచి పర్యాటకుల ను తరలిస్తున్నారు. కాగా, అమెరికా నేషనల్ గార్డ్స్, నౌకా దళం, మెరైన్, కోస్ట్ గార్డ్స్‌ను హవాయికి పంపారు. దావానాలానికి నిర్దిష్ట కారణం ఏమిటతో తేలలేదు. వేసవిలో ఎండిపోయిన వృక్ష సంపదకు అంటుకున్న నిప్పు బలమైన గాలుల కారణంగా విస్తృతంగా వ్యాపించిందని అధికారులు భావిస్తున్నారు.














