Namaste NRI

అరెస్టు వారెంట్‌తో.. ఆ సమావేశాలకు పుతిన్‌ దూరం

ద‌క్షిణాఫ్రికాలోని జోహ‌న్న‌స్‌బ‌ర్గ్‌లో బ్రిక్స్ దేశాల స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. అయితే ఆ స‌మావేశాల‌కు ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్  డుమ్మాకొట్టారు. ఆ మీటింగ్‌కు ఆయ‌న నేరుగా హాజ‌రుకావ‌డంలేదు. వీడియో కాల్ ద్వారా దేశాధినేత‌ల్ని ఉద్దేశించి ఆయ‌న ప్ర‌సంగించ‌నున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్ర‌క‌టించిన ర‌ష్యా నేత‌పై అంత‌ర్జాతీయ క్రికెట్ కోర్టులో కేసు ఉంది. చిన్న పిల్ల‌ల్ని ఎత్తుకెళ్లిన‌ కేసులో పుతిన్‌పై అరెస్టు వారెంట్ జారీ చేశారు. ఐసీసీ అరెస్టు వారెంట్ నేప‌థ్యంలో పుతిన్, బ్రిక్స్ స‌మావేశాల‌కు హాజ‌రుకావ‌డం లేద‌ని తెలుస్తోంది. అరెస్టు చేస్తారేమో అన్న భ‌యంతో ఆయ‌న మీటింగ్‌కు వెళ్ల‌డం లేద‌న్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ మీటింగ్‌కు భార‌త ప్ర‌ధాని మోదీతో పాటు బ్రిక్స్ దేశాల నేత‌లు హాజ‌రువుతున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events