Skip to main content

Namaste NRI

అక్టోబర్‌లో ముత్తయ్య బయోపిక్‌  

ప్రముఖ క్రికెటర్‌, టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌ శ్రీలంక క్రికెటర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా 800. మూవీ ట్రైన్‌ మోషన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్నది. మురళీధరన్‌ పాత్రలో మధుర్‌ మిట్టర్‌ నటిస్తున్నారు. ఆయన భార్య మదిమలర్‌ పాత్రలో మహిమ నంబియార్‌ నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎంఎస్‌ శ్రీపతి దర్శకులు. షెహన్‌ కరుణతిలకతో కలిసి ఆయన స్క్రిప్ట్‌ అందించారు. శివలెంక కృష్ణ ప్రసాద్‌ మాట్లాడుతూ ముత్తయ్య మురళీధరన్‌ నిజ జీవితంలో ఆయన ఎదుర్కొన్న, ఎన్నో సంఘటనలు, ఎత్తుపల్లాలు భావోద్వేగభరితంగా ఈ చిత్రంలో వుంటాయి. బాల్యం నుంచి ఆయన జీవిత ప్రయాణం అంతా ఈ చిత్రంలో వుంటుంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. అక్టోబర్‌లో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం అన్నారు.  కాగా ఈ చిత్రం ఆలిండియా పంపిణీ హక్కులు నిర్మాత, శ్రీదేవి మూవీస్‌ అధినేత శివలెంక కృష్ణప్రసాద్‌ సొంతం చేసుకున్నారు. తమిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో విడుదల చేయనున్నారు.

Social Share Spread Message

Latest News