Skip to main content

Namaste NRI

ఆసక్తి రేకెత్తిస్తున్న శివోహం కాన్సెప్ట్‌ పోస్టర్‌

ప్రముఖ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్‌ పతాకంపై రమేష్‌ వర్మ పెన్మత్స దర్శకత్వంలో శివోహం తెరకెక్కనుంది. ఈ సినిమా వివరాల్ని ప్రకటించింది చిత్రబృందం. రహస్య నిధి, ఓ దుష్ట శక్తి నేపథ్యంలోసాగే ఈ సినిమా మిస్టీరియస్‌ థ్ల్రిలర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి.  శివోహం అంటూ ఓ భారీ కట్టుదిట్టమైన గొలుసు, త్రిషూలంతో బంధించి ఉన్న ఓ ట్రెజర్‌ను చూపించారు. ఈ సినిమా పోస్టర్‌ కాస్త డిఫరెంట్‌గా ఆసక్తిని రేకెత్తించే విధంగా ఉంది. ఇతర వివరాల్ని త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టం చేశాయి. కాగా హీరో పేరు మాత్రం ఇంకా రివీల్‌ చేయలేదు. ఇన్‌ సైడ్‌ టాక్‌ ప్రకారం ఓ టాలీవుడ్‌ మిడిల్‌ రేంజ్‌ హీరో ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించనున్నాడని తెలుస్తుంది. అంతేకాకుండా ఆ హీరో ఇప్పటివరకు ఇలాంటి జానర్‌ను టచ్‌ చేయలేదట. మరి ఆ హీరో ఎవరా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.  కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా సమర్పిస్తుండగా, నేహ జ్ఞానవేల్‌రాజా, మధుర శ్రీధర్‌ రెడ్డి, జి.ధనుంజయన్‌ నిర్మిస్తున్నారు.

Social Share Spread Message

Latest News