Skip to main content

Namaste NRI

యువ స్కేటర్లకు బ్రిస్బేన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానం

బ్రిస్బేన్‌లో జరిగిన వరల్డ్ స్కేట్ ఓషియానియా ఆర్టిస్టిక్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్స్ అండ్‌ పసిఫిక్ కప్‌లో పతకాలు సాధించి యువ స్కేటర్లను బ్రిస్బేన్ తెలంగాణ అసోసియేషన్ అభినందించింది. భారతదేశం నుంచి బ్రిస్బేన్‌కి వచ్చిన యువ స్కేటర్లను సన్మానించారు.   బ్రిస్బేన్ తెలంగాణ అసోసియేషన్, క్వీన్స్‌లాండ్ తెలుగు అసోసియేషన్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ గోల్డ్ కోస్ట్ సహకారంతో మన క్రీడాకారులను సత్కరించేందుకు ఈ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

వరల్డ్ స్కేట్ ఓషియానాలో మన వాళ్లు ఆకట్టుకునే ప్రదర్శనతో మొత్తం 9 గోల్డ్‌ మెడల్స్‌, 8 సిల్వర్‌ మెడల్స్‌, 8 కాంస్య పతకాలు గెలుచుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బ్రిస్బేన్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు కిశోర్ కత్తి , క్వీన్స్ లాండ్ తెలుగు అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రామకృష్ణ బులుసు, శ్రీ కృష్ణరావిపాటి, ఎఫ్ఐసిక్యు ప్రెసిడెంట్ అనుప్ నన్నూరి తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News