Skip to main content

Namaste NRI

 భగవంత్ కేసరి ఫస్ట్ సింగిల్‌కు మూహుర్తం ఫిక్స్

నందమూరి బాల‌కృష్ణ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రం భగవంత్ కేసరి.కాజల్ అగర్వాల్ కథానాయిక.సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈ చిత్రంలో శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. నేషనల్ అవార్డ్ విన్నర్ అర్జున్ రాంపాల్ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతు న్నారు. ఈ సినిమా నుంచి విడుద‌లైన ఫ‌స్ట్ లుక్, గ్లింప్స్ ఇప్ప‌టికే ఆక‌ట్టుకున్నాయి. ఇక మూవీ నుంచి ఫస్ట్‌ సింగిల్‌ను లాంఛ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. తాజాగా ఈ ఫస్ట్‌ సింగిల్‌కు సంబంధించి మేకర్స్ డేట్ అనౌన్స్ చేశారు. వినాయక చవితి కానుక‌గా  సెప్టెంబ‌ర్ 01న‌ గ‌ణేష్ అంథెమ్‌ ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఇక థమన్‌ కంపోజిషన్‌లో రానున్న ఈ సాంగ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.ఈ చిత్రానికి సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించగా, తమ్మి రాజు ఎడిటర్, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్. యాక్షన్‌ పార్ట్‌కి వి వెంకట్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 19న భగవంత్ కేసరి విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News