Skip to main content

Namaste NRI

సెప్టెంబరులో నరకాసుర

రక్షిత్‌ అట్లూరి, అపర్ణ, సంకీర్తన, విపిన్‌, శత్రు కీలక పాత్రల్లో నటిస్తోన్న చిత్రం నరకాసుర. సెబాస్టియన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఆజ్ఞా శ్రీనివాస్‌, కారుమూరు రఘు నిర్మాతలు. నరకాసుర చిత్రీకరణ కొన్ని రోజుల క్రితమే పూర్తి అయ్యింది. ఇటీవల పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేశారు. త్వరలో సెన్సార్ పనులు పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ రెండో వారంలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శక, నిర్మాతలు తెలిపారు. 

ఇటీవల మేం నరకాసుర టీజర్ విడుదల చేశాం. దానికి వచ్చిన స్పందన మాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. టీజర్‌ చూసిన పలువురు సినీ ప్రముఖులు కాంతారా స్థాయిలో ఉంది  అని మమ్మల్ని ప్రశంసించారు. ఆ మాటలు మాకు పెద్ద బూస్ట్ ఇచ్చాయి. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. నరకాసుర అనే ఓ రాక్షసుడి జననం నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఇదొక యాక్షన్‌ థ్రిల్లర్‌  అని దర్శకుడు సెబాస్టియన్ చెప్పారు. నాజర్‌, చరణ్‌ రాజ్‌, శ్రీమాన్‌, ఎస్‌ఎస్‌.కాంచి, గాయత్రి రవిశంకర్‌, తేజ్‌ చరణ్‌రాజ్‌, కార్తిక్‌ సాహస్‌ తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం : నవ్‌పాల్‌ రాజా, ఛాయాగ్రహణం: నాని.

Social Share Spread Message

Latest News