Skip to main content

Namaste NRI

జవాన్ నుంచి నాట్ రామయ్యా వస్తావయ్యా 

బాలీవుడ్  నటుడు షారుఖ్‌ఖాన్‌  నటిస్తున్న తాజా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ జవాన్‌. అట్లీ దర్శకత్వంలో రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో గౌరీ ఖాన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో మేకర్స్‌ బ్యాక్ టు బ్యాక్‌ అప్‌డేట్‌లు ప్రకటిస్తూ సినిమాపై తిరుగులేని హైప్‌ క్రియేట్‌ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి థ‌ర్డ్ సింగిల్‌ను విడుద‌ల చేశారు.  ఇప్ప‌టికే జిందా బందా, చలేయా  అనే సాంగ్‌ల‌తో ప్రేక్షకులను ట్రీట్ చేసిన జవాన్‌ మేకర్స్,  తాజాగా నాట్ రామయ్యా వస్తావయ్యా  అనే పార్టీ సాంగ్‌ను విడుద‌ల చేశారు. అప్పుడేమో చయ్యా చయ్యా రే ఇప్పుడేమో థా థా థైయా  రామయ్యా  వస్తావయ్యా  అంటూ సాగిన ఈ పాట హై-ఎనర్జీ సెలబ్రేషన్‌లా ఉంది. ఇక ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన ఫస్ట్ లుక్‌తో పాటు, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ల‌కు ప్రేక్ష‌కుల నుంచి వీర లెవల్లో రెస్పాన్స్‌ వచ్చింది.  సెప్టెంబరు 7న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Social Share Spread Message

Latest News