Skip to main content

Namaste NRI

కుల వివక్ష వ్యతిరేక బిల్లుకు.. కాలిఫోర్నియా అసెంబ్లీ ఆమోదం

 అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో కుల వివక్ష వ్యతిరేక బిల్లును తెచ్చారు. సమాజంలో కుల వివక్షకు అడ్డుకట్ట వేయడానికి, అట్టడుగు వర్గాలకు పటిష్ట రక్షణ కల్పించాలన్న లక్ష్యంతో కాలిఫోర్నియా రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు సభ్యులు ఆమోదం తెలిపారు. గవర్నర గావిన్‌ న్యూసమ్‌ దీనిపై సంతకం చేస్తే చట్టంగా మారుతుంది. తొలుత ఈ బిల్లును స్టేట్‌ సీనియర్‌ సెనేటర్‌ అయిసా వాహబ్‌ ప్రవేశపెట్టగా, రాష్ట్రంలోని పౌర హక్కుల నేతలు, సంస్థలు మద్దతు తెలిపాయి. ఎస్‌బి 403 (కుల వివక్ష వ్యతిరేక బిల్లు)కి మద్దతుగా ఓటు వేసిన అసెంబ్లీ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈ బిల్లుతో దీర్ఘకాలం నుండి కొనసాగుతున్న వివక్ష నుండి ప్రజలను రక్షిస్తాము  అని వహాబ్‌ ట్వీట్‌ చేశారు. బిల్లు ఆమోదంతో అమెరికాలో కుల వివక్ష వ్యతిరేకతపై చట్టం తెచ్చిన తొలి రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలిచింది.

Social Share Spread Message

Latest News