Skip to main content

Namaste NRI

టీనేజీ ప్రేమతో.. ఓయ్‌ ఇడియట్‌

యశ్వంత్‌, త్రిప్తి శంకర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ఓయ్‌ ఇడియట్‌. వెంకట్‌ కడలి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సత్తిబాబు మోటూరి, శ్రీనుబాబు నిర్మాతలు. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. నిర్మాతలు మాట్లాడుతూ నవతరం ప్రేమకథా చిత్రమిది. టీనేజ్‌లోని అందమైన ప్రేమ భావనలను అద్దంపడుతుంది. ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీగా మెప్పిస్తుంది. కథానుగుణంగా చక్కటి సంగీతం కుదిరింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సతీష్‌ నాయక్‌, సంగీతం: జీకేవీ, నిర్మాణ సంస్థలు: సహస్ర మూవీస్‌, హ్యాపీ లివింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌.

Social Share Spread Message

Latest News