Skip to main content

Namaste NRI

ఓటు చిత్రం నుండి సిరిమల్లె పువ్వాని లాంచ్ చేసిన కె.రాఘవేంద్రరావు

హృతిక్‌ శౌర్య, తాన్వీ నేగి జంటగా నటిస్తున్న సినిమా  ఓటు. చాలా విలువైనది అనేది ఉపశీర్షిక. ఫ్లిక్‌నైన్‌ స్టూడియోస్‌ నిర్మాణంలో రవి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కె.రాఘవేంద్రరావు క్లాసిక్‌ పదహారేళ్ల వయసు సినిమాలోని సిరిమల్లెపువ్వా  పాటను సింగర్‌ సునీత పాడగా రీమిక్స్‌ చేశారు. ఆ పాటను కె.రాఘవేంద్రరావు లాంచ్‌ చేశారు. ఈ పాటలో తాన్వీ నేగి అద్భుతంగా నటించిందని, ఈ పాట సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని దర్శకుడు నమ్మకం వ్యక్తం చేశారు. ఈ సినిమాకు రచన, దర్శకత్వం : రవి, బ్యానర్ : ఫ్లిక్ నైన్ స్టూడియోస్, నిర్మాణం: ఫ్లిక్ ఫిలిమ్స్, సంగీతం: అగస్త్య, డీవోపీ : ఎస్ రాజశేఖర్, ఎడిటర్ : ప్రసాద్, ఆర్ట్ : మోహన్ తాళ్లూరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్: రామకృష్ణ, పీఆర్వో : వంశీ శేఖర్.

Social Share Spread Message

Latest News