Skip to main content

Namaste NRI

అమెరికా మహిళ తామి మానిస్‌ గిన్నిస్‌ రికార్డు

అమెరికాకు చెందిన తామి మానిస్‌ ప్రపంచంలోనే పొడవైన కురులు కలిగిన మహిళగా రికార్డు సృష్టించారు. నాక్స్‌విల్లేకు చెందిన మానిస్‌ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానాన్ని పొందారు. ఆమె కురులు 172.72 సెంటీమీటర్ల పొడవు ఉన్నట్టు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు ప్రతినిధులు తెలిపారు. టెన్నిసే రాష్ర్టానికి చెందిన ఆమె నర్సుగా సేవలందిస్తున్నారు. 1980 నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా జుట్టును కత్తిరించుకోకపోవడంతో ప్రస్తుతం ఆమె కురులు 5.8 అడుగుల వరకు పెరిగాయి. దీంతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు ప్రతినిధులు ఆమెకు ధ్రువపత్రాన్ని అందజేశారు.

Social Share Spread Message

Latest News