Namaste NRI

కోట బొమ్మాళిలో జానపద గీతం..లింగి లింగి లింగిడి

జిఎ2 పిక్చర్స్ బ్యానర్‌లో  మలయాళంలో విజయవంతమైన నాయాట్టు చిత్రం తెలుగులో కోట బొమ్మాళి పేరుతో రీమేక్‌ అవుతున్నది. శ్రీకాంత్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, రాహుల్‌ విజయ్‌, శివానీ రాజశేఖర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తేజ మార్ని దర్శకుడు. బన్నీ వాసు, విద్య కొప్పినీడి నిర్మాతలు. ఈ సినిమాలోని శ్రీకాకుళం జానపద శైలిలో సాగిన లింగి లింగి లింగిడి అనే తొలి గీతాన్ని విడుదల చేశారు. రేలారే ఫేమ్‌ పి.రఘు సాహిత్యాన్ని అందించడంతో పాటు ఆలపించారు. రాహుల్‌ విజయ్‌, శివాని నృత్యం ఈ పాటకు ప్రధానాకర్షణగా నిలిచింది. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events