Skip to main content

Namaste NRI

స్కంద మూవీ నుంచి ఊరమాస్‌ సాంగ్‌ రిలీజ్‌

రామ్‌ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం స్కంద. రామ్‌కు జోడీగా శ్రీలీల నటించింది.   శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. థమన్‌ స్వర పరిచిన ఈ మాస్‌ గీతాన్ని హేమచంద్ర, రమ్య బెహరా, మహా ఆలపించారు. అనంత్ శ్రీరామ్‌ లిరిక్స్‌ క్యాచీగా ఉన్నాయి. ఇక రామ్‌ పోతినేని ఎప్పటిలానే తన ఎనర్జిటిక్‌ స్టెప్స్‌తో ఊపేశాడు. ఇక ఈ స్పెషల్ సాంగ్‌లో బాలీవుడ్‌ ఐటెం గర్ల్‌ ఊర్వశి రౌటెలా నర్తించింది. ఈ స్పెషల్ సాంగ్‌ కూడా ఆ చార్ట్‌ బస్టర్‌ లిస్ట్‌లో చేరుతుందని మేకర్స్‌ తెలుపుతున్నారు.  ఈ నెల 28న విడుదల కానుంది. సాయిమంజ్రేకర్‌, శ్రీకాంత్‌, గౌతమి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సంతోష్‌ డిటాకే, సంగీతం: తమన్‌, రచన-దర్శకత్వం: బోయపాటి శ్రీను.

Social Share Spread Message

Latest News