Skip to main content

Namaste NRI

డబుల్‌ ఇస్మార్ట్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌కు బర్త్‌ డే విషెస్‌

టాలీవుడ్‌లో సక్సెస్‌ రేట్‌ ఎక్కువగా ఉన్న డైరెక్టర్లలో టాప్‌లో ఉంటాడు టాలీవుడ్‌ డాషింగ్ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్. ఈ స్టార్ డైరెక్టర్‌ కాంపౌండ్ నుంచి వస్తోన్న తాజా చిత్రం డబుల్ ఇస్మార్ట్‌. ఎనర్జిటిక్‌ హీరో రామ్‌  టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నాడు. ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి,  వన్ ఆఫ్ ది లీడింగ్ డైరెక్టర్లలో ఒకరిగా మారిన పూరీ జగన్నాథ్‌ పుట్టినరోజు.ఈ సందర్భంగా పూరీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ  పూరీ కనెక్ట్స్‌ టీం కొత్త లుక్‌ ఒకటి విడుదల చేసింది. షూటింగ్ లొకేషన్‌లో రామ్‌, సంజయ్‌ దత్‌ మధ్యలో ఉన్న పూరీ చిల్‌ అవుట్‌ అవుతూ కనిపిస్తున్న స్టిల్‌ నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది. మాస్ సినిమాను తనదైన శైలిలో పునర్నిర్వచించిన సెన్సేషనల్ డైరెక్టర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు అని తెలియజేశాడు సంజయ్‌ దత్‌.

Social Share Spread Message

Latest News