Skip to main content

Namaste NRI

ఎన్నారై టీడీపీ-జనసేన ఆధ్వర్యంలో చలో ఇండియన్‌ కాన్సులేట్‌ విజయవంతం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా అమెరికాలో ఎన్నారై టీడీపీ`జనసేన సంయుక్తంగా చలో ఇండియన్‌ కాన్సులేట్‌,  శాన్‌ఫ్రాన్సిస్కో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాయి. బే ఏరియాలోని ఎన్నారైలు డిప్యూటీ కాన్సుల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా,  శాన్‌ఫ్రాన్సిస్కోకి మెమొరాండం సమర్పించారు. ఎన్నారైలు సమర్పించిన వినతిపత్రం భారత ప్రభుత్వానికి, కేంద్ర హోం మంత్రికి పంపుతామని డిప్యూటీ కాన్సుల్‌ తెలిపారు. ఈ వారం నిరసనల్లో భాగంగా ఎన్నారై టీడీపీ, జనసేన సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని పిలుపునిచ్చాయి. భారీగా హాజరైన టీడీపీ, జనసేన కార్యకర్తలు వియ్‌ స్టాండ్‌ విత్‌ సీబీఎన్‌ అంటూ నినాదాలు చేశారు.

Social Share Spread Message

Latest News