Skip to main content

Namaste NRI

రాకేశ్‌ వర్రే జితేందర్‌ రెడ్డి ఫస్ట్‌ లుక్‌

ఉయ్యాల – జంపాల  ఫేమ్‌ విరించి వర్శ దర్శకత్వం వహించిన చిత్రం జితేందర్‌ రెడ్డి. రాకేశ్‌ వర్రే కథానాయకుడు. ముదుగంటి రవీందర్‌ రెడ్డి నిర్మాత. సోమవారం ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. రాకేశ్‌ వర్రె తెల్ల చొక్కా, ఖాకీ ప్యాంట్‌లో చేతిలో తుపాకీ పట్టుకుని సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తూన్నలుక్‌.. బయటకు వచ్చింది. ఈ పాత్ర కోసం దర్శకుడు విరించి వర్మ చాలా మందిని ఆడిషన్‌ చేశారు. చివరికి రాకేశ్‌ని ఎంచుకొన్నారు. బాహుబలి, ఎవరికీ చెప్పొద్దు లాంటి సినిమాలతో రాకేశ్‌ మంచి గుర్తింపు తెచ్చుకొన్నారు. జితేందర్‌ రెడ్డి ఆయన కెరీర్‌లో మరో మలుపు అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి వీఎస్‌ జ్ఞానశేఖర్‌ సినిమాటోగ్రాఫర్‌ కాగా,  గోపీసుందర్ సంగీతం అందిస్తున్నాడు. జితేందర్‌ రెడ్డి సినిమా కోసం పనిచేస్తున్న నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై త్వరలో క్లారిటీ రానుంది.

Social Share Spread Message

Latest News