Skip to main content

Namaste NRI

విదేశాల్లో భారత్‌కు వ్యతిరేకంగా… ఖలిస్థాన్‌ మద్దతుదారులు

విదేశాల్లో భారత్‌కు వ్యతిరేకంగా ఖలిస్థాన్‌ మద్దతుదారులు రెచ్చిపోతున్నారు. తాజాగా లండన్‌లో భారత దౌత్య కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ ఫొటోలతో కూడిన ప్లకార్డులు, జెండాలు చేతబూని భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దౌత్య కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో ఖలిస్థాన్‌ మద్దతుదారులు చేరుకున్నారు. దీంతో బ్రిటిష్‌ భద్రతా బలగాల్ని దౌత్య కార్యాలయం వద్ద మోహరించాల్సి వచ్చింది. రెండు రోజుల క్రితం యూకేలో భారత దౌత్యవేత్త విక్రమ్‌ దొరైస్వామిని స్కాట్లాండ్‌లోని గురుద్వారాలోకి ప్రవేశించకుండా ఖలిస్థాన్‌ మద్దతుదారులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై భారత్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బ్రిటన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

Social Share Spread Message

Latest News