Namaste NRI

అయలాన్ టీజ‌ర్ ముహూర్తం ఫిక్స్

కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్‌ తాజాగా న‌టిస్తున్న చిత్రం అయలాన్‌. ఈ సినిమాలో రకుల్ ప్రీత్‌సింగ్ క‌థ‌నాయిక‌గా న‌టిస్తుంది. ఆర్‌.రవికుమార్ ద‌ర్శ‌క‌త్వం.  ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్‌.రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే మూవీ నుంచి మేకర్స్‌ లాంఛ్ చేసిన అయలాన్ ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ నెట్టింట హల్‌ చల్ చేస్తోంది. శివకార్తికేయన్‌ గగనంలో విహరిస్తుండగా,  అతడితోపాటే ఏలియన్‌ కూడా వెళ్తున్న లుక్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి మేక‌ర్స్ సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు.ఈ మూవీ టీజ‌ర్‌ కు మేక‌ర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు. అయలాన్‌ టీజ‌ర్‌ను అక్టోబ‌ర్ 06న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం తెలిపింది. దీనితో పాటు ఒక ఫొటో కూడా వ‌దిలింది. ఈ ఫొటోలో ఏ.ఆర్‌.రెహమాన్‌తో పాటు శివకార్తికేయన్, రవికుమార్, గ్రహాంతర వాసి టీజర్ కోసం చూస్తున్న‌ట్లు ఉంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events