కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న చిత్రం లియో. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం. త్రిష హీరోయిన్. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లియో మూవీ ట్రైలర్‌కు సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ ట్రైలర్‌ను అక్టోబర్ 05న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. డేట్ అయితే చెప్పారు కానీ ట్రైలర్ టైం చెప్పకపోవడంతో విజయ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇక వీరికి ఉపశమనం కలిపిస్తూ తాజాగా ఒక సాలిడ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా ట్రైలర్‌ను ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక మాస్టర్ తర్వాత విజయ్-లోకేశ్ కాంబోలో వస్తోన్న రెండో చిత్రమిది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్, టైటిల్ ప్రోమో గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ లాంచ్ చేయగా, ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అక్టోబర్ 19న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.














