Namaste NRI

ఈ సినిమా విజయం పక్కా .. దుల్కర్‌ సల్మాన్‌

సంగీత్‌శోభన్‌, నార్నే నితిన్‌, రామ్‌ నితిన్‌, శ్రీగౌరీప్రియ, అనంతిక సునీల్‌కుమార్‌, గోపికా ఉద్యాన్‌ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం మ్యాడ్‌. కల్యాణ్‌శంకర్‌ దర్శకుడు. హారిక సూర్యదేవర నిర్మాత. ఈ చిత్రం విడుదల కానుంది.  ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. దుల్కర్‌సల్మాన్‌, సిద్ధు జొన్నలగడ్డ, శ్రీలీల అతిథులుగా హాజరయ్యారు.  దుల్కర్‌ సల్మాన్‌ మాట్లాడుతు ట్రైలర్‌ చూశాను పేరుకు తగ్గట్టే మ్యాడ్‌ గా ఫన్నీగా ఉంది. ఎవరూ కొత్తవాళ్లలా లేరు. అందరూ బాగా చేశారు. ఈ సినిమా విజయం పక్కా అని అన్నారు. నవ్వించే విషయంలో జాతిరత్నాలు కు ఈ సినిమా ఏమాత్రం తగ్గదని సిద్ధు జొన్నలగడ్డ నమ్మకంగా చెప్పారు. ఇంకా శ్రీలీల, వెంకీ అట్లూరి, అనుదీప్‌లతో పాటు ప్రధానతారాగణం అంతా మాట్లాడారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events