Skip to main content

Namaste NRI

కష్టతరమే కానీ.. జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకం

కార్తీక్ ఆర్యన్‌ హీరోగా న‌టిస్తున్న చిత్రం చందూ ఛాంపియన్‌. కబీర్‌ఖాన్  ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం. ప్రస్తుతం జమ్మూ & కాశ్మీర్‌లో ఈ సినిమా రెండవ షెడ్యూల్ షూటింగ్‌ జరుపుకుంటుండ‌గా, ఈ షూటింగ్ సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ మూవీ షూటింగ్‌లో భాగంగా 8 నిమిషాల వార్ సీక్వెన్స్‌ను సింగిల్ షాట్‌లో చిత్రీకరించిన‌ట్లు చిత్ర‌బృందం తెలిపింది. ఇక ఈ షూటింగ్‌ను సముద్ర మట్టానికి 9000 అడుగుల ఎత్తులో చేసిన‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. ఈ 8 నిమిషాల నిడివి గల సింగిల్ షాట్ వార్ సీక్వెన్స్‌,  నా యాక్టింగ్ కెరీర్‌లో అత్యంత సవాలుగా, అద్భుతమైనదిగా, కష్టతరంగానే కాకుండా మరపురాని షాట్‌గా మారింది. కబీర్‌ఖాన్ సార్  జీవితాంతం గుర్తుంచుకునే ఇలాంటి జ్ఞాపకాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు  కార్తీక్ ఆర్యన్.

Social Share Spread Message

Latest News