కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న చిత్రం చందూ ఛాంపియన్. కబీర్‌ఖాన్ ఈ సినిమాకు దర్శకత్వం. ప్రస్తుతం జమ్మూ & కాశ్మీర్‌లో ఈ సినిమా రెండవ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుండగా, ఈ షూటింగ్ సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ షూటింగ్‌లో భాగంగా 8 నిమిషాల వార్ సీక్వెన్స్‌ను సింగిల్ షాట్‌లో చిత్రీకరించినట్లు చిత్రబృందం తెలిపింది. ఇక ఈ షూటింగ్‌ను సముద్ర మట్టానికి 9000 అడుగుల ఎత్తులో చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ 8 నిమిషాల నిడివి గల సింగిల్ షాట్ వార్ సీక్వెన్స్, నా యాక్టింగ్ కెరీర్‌లో అత్యంత సవాలుగా, అద్భుతమైనదిగా, కష్టతరంగానే కాకుండా మరపురాని షాట్‌గా మారింది. కబీర్‌ఖాన్ సార్ జీవితాంతం గుర్తుంచుకునే ఇలాంటి జ్ఞాపకాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు కార్తీక్ ఆర్యన్.














