పాలస్తీనా ఉగ్ర సంస్ధ హమాస్ దాడులు, ఇజ్రాయెల్ ప్రతిదాడులతో అట్టుడుకుతున్న ఇజ్రాయెల్‌లో బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్ అడుగుపెట్టారు. హమాస్‌తో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌కు తాము పూర్తి బాసటగా నిలుస్తామని ఈ సందర్భంగా రిషీ సునాక్ భరోసా ఇచ్చారు. ఉగ్రవాదమనే దుష్టశక్తితో పోరాడుతున్న మీకు సంఘీభావం తెలుపుతున్నామని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌లో యుద్ధ వాతావరణం, హమాస్ దాడుల గురించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్‌తో రిషీ సునాక్ సంప్రదింపులు జరుపుతారు.














