Skip to main content

Namaste NRI

అమెరికా వెళ్లాలనుకునే వారికి ఇది శుభవార్త

అమెరికా వెళ్లాలనుకునే వారికి ఇది శుభవార్త. అమెరికా ప్రభుత్వం ఇండియన్స్‌ కోసం కొత్తగా 2,50,000 కొత్త అపాయింట్స్‌ వీసా స్లాట్స్‌ను వారంతంలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. గత వారం అమెరికా వీసా అపాయింట్‌మెంట్‌ కోసం కనీసం ఢిల్లిలో 543రోజుల వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని వెల్లడించింది.  తాజాగా భారీగా అపాయింట్స్‌ ఇవ్వనున్నందున వేచి చూసే సమయం 126 రోజులు తగ్గిపోనుంది. ముంబై, చెన్నయ్‌, హైదరాబాద్‌ కేంద్రాల్లో మాత్రం 500 రోజులకు పైగా ఎదురు చూడకతప్పదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సంవత్సరం సెప్టెంబర్‌ నాటికి మన దేశం నుంచి 1,50,000 మంది అమెరికా వెళ్లారు.

Social Share Spread Message

Latest News