ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హోటల్ సూట్ ఇదే. దుబాయ్‌లోని అట్లాంటిస్ ది రాయల్ హోటల్‌లో కొలువుదీరిన అద్భుతమైన రూం టూర్‌ను బాలీవుడ్ నటి అనన్యా పాండే ఇన్‌స్టాగ్రాం రీల్‌లో ప్రదర్శించింది. ఈ లగ్జరీ ప్రాపర్టీ రూమ్స్, పూల్ డెక్, ఆఫీస్, లైబ్రరీ, కాన్ఫరెన్స్ రూమ్‌లను ఈ వీడియోలో చూపించింది. ఈ అల్ట్రా లగ్జరీ ఎక్స్‌పరిమెంటల్ రిసార్ట్‌లో ఓ రాత్రి గడపాలంటే రూ. 83 లక్షలు చెల్లించాలి. ఈ అల్ట్రా మోడరన్ టూ లెవెల్ ఫోర్ బెడ్‌రూం పెంట్‌హౌస్ ది రాయల్ మ్యాన్షన్‌లో 12 సీట్ల డైనింగ్ రూం, ఎంటర్‌టైన్మెంట్ రూం, స్విమ్మింగ్ పూల్, దుబాయ్ ఆకాశహార్మ్యాలకు పోటీ పడే ఎత్తులో ప్రైవేట్ టెర్రెస్‌లు అలరిస్తాయి.














